: 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తిపై నెటిజన్ల మండిపాటు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లుగా భారత్ నుంచి ఘనతర ఆవిష్కరణలేవీ రాలేదని, మన సైంటిస్టులకు ప్రపంచాన్ని కదిలించే ఆలోచనలు రావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా జనులు తప్పుబట్టారు. భారత్ లో ఏం జరుగుతోందో నారాయణమూర్తికి అర్థమవుతున్నట్టు లేదని కొందరు ట్వీట్ చేశారు. అసలు, ప్రపంచాన్ని కదిలించడం అంటే ఏమిటని కొందరు ప్రశ్నించారు. మనదేశ శాస్త్రవేత్తలను నారాయణమూర్తి విమర్శించడం భావ్యం కాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. నారాయణమూర్తి బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ సైంటిస్టులపై వ్యాఖ్యలు చేశారు.