: ఇక విదేశాల్లోనూ వేట మొదలుపెడతా: అశ్విన్


"ఉపఖండంలోనే రాణిస్తాడు... విదేశీగడ్డపై ప్రభావం చూపలేడు"... ఇదీ భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై విమర్శకుల అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని మారుస్తానంటున్నాడు అశ్విన్. ఇక, విదేశాల్లోనూ వికెట్ల వేట మొదలుపెడతానని ధీమాగా చెప్పాడు. ఉపఖండం వెలుపల భారత జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించాలని ఆశిస్తున్నట్టు తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఆస్ట్రేలియా వంటి పేస్ కు అనుకూలించే దేశాల్లోనూ ఇకపై తాను మరిన్ని వికెట్లు తీయడం చూస్తారని వ్యాఖ్యానించాడు. ఉపఖండంలో 16 టెస్టులాడి 23.87 సగటుతో 100 వికెట్లు తీసిన ఈ తమిళతంబి, విదేశీ గడ్డపై 9 టెస్టులాడి 56.58 సగటుతో 24 వికెట్లే దక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News