: హాట్ కేకుల్లా అమ్ముడైన బైకులు


కేవలం 26 నిమిషాల్లోనే రాయల్ ఎన్ ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ బైకులు 200 అమ్ముడయ్యాయి. చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ కు చెందిన 200 రాయల్ ఎన్ ఫీల్డ్ డిస్పాచ్ మోటార్ సైకిళ్లను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది. గత మేలో లిమిటెడ్ ఎడిషన్ పేరిట రాయల్ ఎన్ ఫీల్డ్ డిస్పాచ్ మోటారు సైకిళ్లను ఐషర్ సంస్థ ఆవిష్కరించింది. వాటిని ఆన్ లైన్లో పెట్టగా, కేవలం 26 నిమిషాల్లోనే సంస్థ తయారు చేసిన 200 బైకులను ఔత్సాహికులు కొనేశారని రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ తెలిపారు. ఈ బైకు ధర 2.16 లక్షల రూపాయలని, దీనిని ప్రపంచ యుద్ధ సమయాల్లో సైనికుల డిస్పాచ్ కోసం వినియోగించేవారని సంస్థ పేర్కొంది. 499 సీసీ సామర్థ్యం కలిగిన ఈ వినూత్న వాహనానికి సరికొత్త హంగులు జోడించి మార్కెట్ లోకి విడుదల చేశారు. దీంతో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి

  • Loading...

More Telugu News