: ఢిల్లీలో కూడా 'అమ్మ' క్యాంటీన్ల తరహా భోజనం
'అమ్మ' క్యాంటీన్ల పేరుతో తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న తక్కువ ధరకు భోజనం పలు రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా తీసుకురావాలని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కూడా తక్కువ ధరకు భోజనం అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో రూ.5 నుంచి రూ.10లకు భోజనం అందించే పథకాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. ఈ పథకం విజయవంతమవుతుందని ఆప్ సర్కార్ ధీమాతో ఉంది. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ తరహ క్యాంటీన్లను ఏర్పాటుచేసి తక్కువ ధరకు భోజనం అందిస్తోంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా 'అన్న క్యాంటీన్ల' పేరుతో తక్కువ ధరకు భోజనం అందించాలనుకుంటున్న సంగతి తెలిసిందే.