: ప్రత్యూషను వివరాలు అడిగి తెలుసుకున్న హైకోర్టు స్పెషల్ ఆఫీసర్
కన్నతండ్రే కర్కశత్వంతో విరుచుకుపడగా, సవతి తల్లి రాక్షసావతారం ఎత్తగా నిలువెల్లా గాయపడిన ప్రత్యూష క్రమంగా కోలుకుంటోంది. హైదరాబాదు ఎల్బీ నగర్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను గురువారం హైకోర్టు ప్రత్యేక అధికారి పరామర్శించారు. ఆమె స్థితిగతుల పర్యవేక్షణకు హైకోర్టు ఓ ప్రత్యేక అధికారిని నియమించడం తెలిసిందే. ఆయన ఆసుపత్రికి వచ్చి ప్రత్యూషతో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. కొన్ని రోజుల క్రితం పోలీసులు, ఎన్జీవోల సహకారంతో ప్రత్యూష రాక్షస చెర నుంచి బయటపడింది. అప్పటికే ఆమె తీవ్రగాయాలపాలవడంతో ఆసుపత్రిలో చేర్చారు.