: ఆ పరిస్థితిలో ఎవరైనా చేయగలిగిందేమీలేదన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్


రాజమండ్రిలో పుష్కరాల ఆరంభం నాడు తొక్కిసలాట కారణంగా పదుల సంఖ్యలో భక్తులు మృతి చెందిన ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కేంద్ర హోం శాఖకు నివేదిక పంపడం తెలిసిందే. తన నివేదికలో ఆయన దాన్ని ప్రమాద ఘటనగానే పేర్కొన్నారు. పుష్కరాల తొలిరోజు స్నానమాచరిస్తే పుణ్యం వస్తుందన్న నమ్మికతోనే భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని, ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పిందని కలెక్టర్ తన నివేదికలో వివరించారు. ఆ పరిస్థితిలో ఎవరైనా చేయగలిగిందేమీ లేదని పేర్కొన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనే అని స్పష్టం చేశారు. వేల సంఖ్యలో భక్తులు దూసుకురాగా, పోలీసులు గానీ, మరే వ్యవస్థ గానీ ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు.

  • Loading...

More Telugu News