: మరింత తగ్గిన బంగారం ధర


బంగారం ధర మరింత తగ్గింది. బలహీనంగా ఉన్న ఇంటర్నేషనల్ మార్కెట్లు, కొనుగోలు దారులు లేకపోవడంతో స్టాకిస్టుల నుంచి నూతన ఆర్డర్లు రాకపోవడం... తదితర కారణాలతో గురువారం నాటి సెషన్లో బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 120 తగ్గి, రూ. 26,130కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 480 పడిపోయి రూ. 34,700 స్థాయికి చేరుకుంది. ఇండియాలో శుభకార్యాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో బంగారానికి డిమాండు లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News