: అమెరికా మాజీ అధ్యక్షుడు జారి... పడిపోయారు
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ (91) జారి పడిపోయారు. అమెరికా 41వ అధ్యక్షుడిగా పని చేసిన జార్జ్ బుష్ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మెడ ఎముక విరిగిపోయింది. దీంతో ఆయనను పోర్ట్ లాండ్ మెయిన్ మెడికల్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, ఆయన కుమారుడు కూడా అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే.