: హైదరాబాద్ వంటి రాజధాని వస్తుందన్న నమ్మకం లేదు: దేశం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి, హైదరాబాదులాగా సకల సదుపాయాలతో వస్తుందన్న నమ్మకం తనకు లేదని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదుకు వెళ్లినప్పుడల్లా తనకు బాధ కలుగుతుందని ఆయన అన్నారు. తాడిపత్రి పట్టణాభివృద్ధికి అవసరమైతే ఏపీ ప్రభుత్వంపై దౌర్జన్యానికి దిగుతానని ఆయన హెచ్చరించారు. రాయలసీమకు తాగు, సాగునీటిని అందిస్తేనే బాబు మళ్లీ సీఎం అవుతారని అన్నారు. బాబు సర్కారు అమలు చేస్తున్న పథకాలన్నీ వృథా అయిపోతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ అనంతపురం రావాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పాలన సమయంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం చేస్తే చాలని జేసీ సూచించారు.