: రాజమండ్రిలో పుష్కర స్నానం చేయనున్న సింగపూర్ బృందం


గోదావరి పుష్కరాల్లో ఈసారి సింగపూర్ బృందం కూడా పాల్గొనబోతోంది. ఈ నెల 19న రాత్రికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సహా 20 మంది బృందం హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనలో సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ను ఈ నెల 20న సీఎం చంద్రబాబుకు అందజేస్తారు. అదేరోజు రాజమండ్రిలో రాజధాని అమరావతిపై ఏర్పాటుచేసే సెమినార్ లో సింగపూర్ బృందం పాల్గొంటుంది. తరువాత రాజమండ్రిలో ఈశ్వరన్ బృందం పుష్కర స్నానం చేయనుందని తెలిసింది.

  • Loading...

More Telugu News