: మహిళల విషయంలో కోర్టుల తీర్పులపై రాష్ట్ర మహిళా కమిషన్ అసంతృప్తి
మహిళల విషయంలో న్యాయస్థానాలు వెల్లడించే తీర్పులు సరిగా లేవంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నం సంచలన ఆరోపణలు చేశారు. కోర్టులో మహిళల కేసుల విచారణ త్వరగా పూర్తి చేసి నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతులు, మహిళలు సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వస్తే చిన్నచూపు చూడరాదని కోరారు. ఇటీవల ప్రేమ పేరుతో యామిని, శ్రీలేఖ అనే అక్కా చెల్లెళ్లను చంపిన అమిత్ సింగ్ ను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అమ్మాయిలను వేధిస్తున్నారని తెలిస్తే వెంటనే స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. లేదంటే మహిళా కమిషన్ ను సంప్రదించాలని సూచించారు.