: ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో సచిన్ తనయుడు అర్జున్!
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే, అప్పుడప్పుడూ భారత ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించే అర్జున్ తాజాగా ఇంగ్లాండ్ ఆటగాళ్లతో చేరిపోయాడు. యాషెస్ సిరీస్ కోసం ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లకు అర్జున్ బౌలింగ్ చేశాడు. అర్జున్ బౌలింగ్ చేస్తుంటే ఆ జట్టు కెప్టెన్ కుక్ చాలాసేపు పరిశీలిస్తూ ఉండిపోయాడు. ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ కోచ్ గిబ్సన్ అయితే, అర్జున్ వద్దకు వచ్చి కొన్ని చిట్కాలు కూడా చెప్పాడు. క్రికెట్ లో మరింత రాటుదేలేందుకు అర్జున్ ఇంగ్లాండ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.