: ఇక కార్బన్ మొబైల్స్ వంతు... తెలంగాణలో అసెంబ్లింగ్ ప్లాంట్ దిశగా సర్కారుతో చర్చలు
నిన్నటికి నిన్న సెల్ కాన్ మొబైల్ కంపెనీ తన హ్యాండ్ సెట్ల తయారీ ప్లాంట్ ను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ యూనిట్... సెల్ కాన్ ఉత్పత్తి ప్లాంట్ లలోకెల్లా అతిపెద్దదట. తాజాగా మరో మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ కార్బన్ కూడా సెల్ కాన్ బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో తన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసే దిశగా కార్బన్ మొబైల్స్ అడుగులేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ యాజమాన్యం కేసీఆర్ సర్కారుతో చర్చలు జరుపుతోందట. ఈ మేరకు ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశిన్ దేశ్ సారే నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు. మొబైల్ హ్యాండ్ సెట్ల విక్రయాలు నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ లో అసెంబ్లింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.