: ఒక్క నిమిషం పాటు చూసి... 270 బైనరీ డిజిట్స్ చెప్పేసి.. గిన్నిస్ రికార్డు సృష్టించాడు
కేవలం ఒక నిమిషం పాటు 270 బైనరీ డిజిట్స్ ను తేరిపార చూసి క్రమం తప్పకుండా చెప్పేసి గిన్నిస్ రికార్డు సృష్టించాడో భారతీయుడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అరవింద్ (36) ఇటలీలో టూరిస్టు గైడ్ గా పనిచేస్తున్నారు. ఇటాలియన్, స్పానిష్ , ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీసు భాషలను మాట్లాడగల అరవింద్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 270 బైనరీ అంకెల క్రమాన్ని కేవలం ఒక నిమిషం పాటు తేరిపార చూసిన అరవింద్, క్రమం తప్పకుండా వాటన్నింటినీ తిరిగి చెప్పేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతో గిన్నిస్ రికార్డ్స్ అధికారులు, ఆయనకు ప్రపంచ రికార్డును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల కోసం మెమొరీ క్లబ్ ప్రారంభిస్తానని, ఆ క్లబ్ ద్వారా విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందేలా చేస్తానని అన్నారు.