: ఫోన్ కోసం అక్కా బావలను హతమార్చాడు


ఆడంబరాలకు విలువనిస్తూ పిల్లల్ని పెంచడం వల్ల కలిగే అనర్థాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సంఘటన మిజోరం రాజధాని ఐజ్వాల్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల ఏడున 16 ఏళ్ల బాలుడు తన అక్క, బావలను హత్య చేసి 36 వేల రూపాయల నగదుతో పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు బాలుడిని పట్టుకుని జువైనల్ హోంకు తరలించారు. అక్కడ విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్ కొనుక్కునేందుకు వేట తుపాకీతో అక్క, బావలను చంపి డబ్బు తీసుకుని పారిపోయినట్టు బాలుడు వెల్లడించాడు.

  • Loading...

More Telugu News