: క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు
క్లీన్ స్వీప్ ప్రమాదం నుంచి భారత మహిళా క్రికెట్ జట్టు తప్పించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత మహిళా జట్టు రాణించింది. తొలి రెండు టీట్వంటీల్లో ఓటమి పాలైన భారత జట్టు, చివరి మ్యాచ్ లో సమష్టిగా రాణించింది. దీంతో న్యూజిలాండ్ మహిళా జట్టుపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో న్యూజిలాండ్ జట్టు టీట్వంటీ సిరీస్ కైవసం చేసుకుంది. కాగా, అంతకు ముందు జరిగిన వన్డే సిరీస్ ను భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.