: రేవంత్, ఉదయసింహలు ఎందుకు ఫోన్ చేశారు?: కృష్ణకీర్తన్ కు ఏసీబీ ప్రశ్నలు


టీడీపీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ ఏసీబీ విచారణ పూర్తైంది. ఉదయం పది గంటల నుంచి కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ అధికారులు సాయంత్రం ఏడు గంటలకు విడిచిపెట్టారు. ఓటుకు నోటు కుంభకోణం సందర్భంగా స్టీఫెన్ సన్ కు డబ్బు ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి, ఉదయసింహలు ఎందుకు ఫోన్ చేశారంటూ కృష్ణ కీర్తన్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఓటుకు నోటు కుంభకోణంలో ఇతర విషయాలపై కూడా ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం. కేవలం సాక్షిగానే కృష్ణ కీర్తన్ ను విచారణకు పిలిచామని ఏసీబీ చెబుతోంది.

  • Loading...

More Telugu News