: చంద్రబాబు చేసింది పుష్కరస్నానం కాదు... సినిమా షూటింగ్!: రఘువీరా


పుష్కరాల సందర్భంగా రాజమండ్రి గోదావరి తీరంలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పందించారు. తొక్కిసలాట మరణాలకు ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఆయన వీఐపీ ఘాట్ కు కాకుండా, సాధారణ ఘాట్ కు ఎందుకు వెళ్లినట్టు? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసింది పుష్కరస్నానం కాదని, సినిమా షూటింగ్ అని విమర్శించారు. తొక్కిసలాట ఘటనను విపక్షాలు రాజకీయం చేయడం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆత్మను కూడా చంద్రబాబు పట్టిపీడిస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన రఘువీరా, పుష్కరాలు ముగిసిన తర్వాత అక్రమాలను బయటపెడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News