: స్వీయ నియంత్రణలో భక్తులు...రాజమండ్రి పుష్కర ఘాట్ లలో క్యూ లైన్ పాటిస్తున్న వైనం!


గోదావరి పుష్కరాల్లో భాగంగా తొలిరోజైన నిన్న రాజమండ్రిలోని కోటగుమ్మం ఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది చనిపోయిన ఘటన అటు ప్రభుత్వాన్నే కాక, ఇటు భక్తులను కూడా అప్రమత్తం చేసింది. ప్రమాదం దరిమిలా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాజమండ్రిలోనే బస చేశారు. అధికారులు, పోలీసులు కూడా పుష్కరాలకు తరలివస్తున్న భక్తులకు ఏర్పాట్లు, భద్రతపై మరింతగా దృష్టి సారించారు. తాజాగా భక్తుల్లో పరివర్తన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పోలీసుల ప్రమేయం లేకుండానే స్వీయ నియంత్రణ పాటిస్తున్న భక్తులు ఘాట్ లలో క్యూ లైన్లలో సాగుతున్నారు. ఘాట్ ప్రారంభం నుంచే క్యూ పాటిస్తున్న భక్తులు నదీ జలాల దాకా అదే క్రమశిక్షణతో వెళుతూ, స్నానం ముగించుకున్న తర్వాత కూడా అదే క్యూలో బయటకు వస్తున్నారు.

  • Loading...

More Telugu News