: ఎంఎస్ విశ్వనాథన్ అంతిమ యాత్ర ప్రారంభం... తరలివచ్చిన సినీలోకం


ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ అంతిమ యాత్ర కొద్దిసేపటి క్రితం చెన్నైలో ప్రారంభమైంది. నగరంలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్రలో సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం చెన్నైలోని మలార్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆయన నిన్న ఆస్పత్రిలోనే కన్నుమూశారు. మరికాసేపట్లో ఆయన అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.

  • Loading...

More Telugu News