: ముంబయి పేలుళ్ల కిరాతకుడు యాకూబ్ మెమన్ కు ఈ నెల 30న ఉరి


దేశ చరిత్రలో అత్యంత విషాద ఘట్టాల్లో 1993 ముంబయి పేలుళ్ల ఘటన ఒకటి. ఆ కేసులో యాకూబ్ మెమన్ (53)కు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. దీనిపై మెమన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష నిరాకరించారు. దీంతో, ఈ నెల 30న మెమన్ ను ఉరితీయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మెమన్ నాగ్ పూర్ కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఆ కిరాతకుడిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News