: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దైంది. హస్తినలో రేపు జరగాల్సిన నీతీ అయోగ్ సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే గోదావరి పుష్కర్ ఘాట్ లో తొక్కిసలాట ఘటన కారణంగా పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. రాజమండ్రిలోనే ఉండి ఆయన పరిస్థితిని సమీక్షించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరిన్ని భద్రతా చర్యలు చేపట్టనున్నారు.