: కేసీఆర్ పుష్కరస్నానంపై రేవంత్ రెడ్డి స్పందన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం కరీంనగర్ జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో కుటుంబ సమేతంగా పవిత్ర పుష్కర స్నానం ఆచరించడం తెలిసిందే. అయితే, కేసీఆర్ పుష్కర స్నానం పట్ల టీడీపీ నేత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ పుష్కర స్నానం ఆచరించడంతో రాష్ట్రానికి కీడు వాటిల్లుతుందని అన్నారు. వదిన చనిపోవడంతో సీఎం కేసీఆర్ కు మైల ఉంటుందని, ఆయన పుష్కర స్నానం ఆచరించరాదని వేద పండితులు చెప్పారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ వేదపండితుల మాట పెడచెవినబెట్టి గోదావరిలో మునిగారని మండిపడ్డారు. లక్ష పాపాలు చేసి గోదావరిలో మునిగితే పాప పరిహారం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు.