: 'రిడీఫ్.కామ్' వెబ్ సైట్ పై జయ పరువునష్టం దావా


అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 'రిడీఫ్.కామ్' వెబ్ సైట్ పై పరువునష్టం దావా వేశారు. తన ఆరోగ్యంపై నిరాధార కథనాలను ప్రచురించారంటూ ఈ మేరకు ఆ వెబ్ సైట్ కు నోటీసులు పంపారు. చెన్నైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో జయ తరపున న్యాయవాది ఎంఎల్ జెగన్ క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఎలాంటి వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా, అమ్మ ఇమేజ్ ను దిగజార్చాలన్న ఉద్దేశంతో... "చెన్నై మీడియా న్యూ జయలలితాస్ హెల్త్ ఈజ్ నాట్ ఫైన్, బట్ కెప్ట్ మమ్" అన్న టైటిల్ తో ఓ ఆర్టికల్ రాసినట్టు తన ఫిర్యాదులో జయ పేర్కొన్నారు. జయలలితకు ఏమైంది...? అన్న అంశంతో గత కొన్ని రోజులుగా తమిళనాడులో చర్చలు జరుగుతున్నాయి. జయ ఆరోగ్య పరిస్థితిని బహిర్గతం చేయాలంటూ టీఎన్ సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, పలువురు డిమాండ్ కూడా చేశారు.

  • Loading...

More Telugu News