: మృతుల కుటుంబాలకు వెంకటసాయి మీడియా అధినేత ఆర్థికసాయం
రాజమండ్రి పుష్కర ఘాట్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు వెంకటసాయి మీడియా అధినేత సీహెచ్ రాజశేఖర్ ఆర్థికసాయం ప్రకటించారు. ఒక్కొ కుటుంబానికి రూ.50 వేల చొప్పున సహాయంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 27 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.