: కార్మికులను కొంతమంది ప్రలోభపెడుతున్నారు: కమిషనర్ సోమేశ్ కుమార్


ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్ల పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. మూడు రోజుల్లో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఇదిలా ఉంచితే, ఉదయం నుంచి కార్మికులు, ఫీల్డ్ సూపర్ వైజర్లు విధులకు వచ్చారని కమిషర్ వెల్లడించారు. అయితే కార్మికులు విధుల్లోకి రాకుండా కొంతమంది వారిని ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తే, సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News