: పుష్కర ఘాట్ తొక్కిసలాట ఘటనపై దత్తాత్రేయ, జగన్ దిగ్భ్రాంతి


రాజమండ్రి పుష్కర ఘాట్ లో తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే జగన్ రాజమండ్రి బయలుదేరి వెళ్లారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ మధ్యాహ్నం 1.30కు ఆయన రాజమండ్రి చేరుకుని, బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయినవారికి సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News