: తొలిరోజు పుష్కర స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందనేది కేవలం అపోహ: స్వరూపానంద
గోదావరి పుష్కరాల మొదటిరోజున పుష్కర స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందన్న ప్రచారాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి తిరస్కరించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా కేవలం అపోహేనని పేర్కొన్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు స్నానం చేయవచ్చని తెలిపారు. 12 రోజులే గాకుండా సంవత్సరంలో ఎప్పుడైన స్నానం చేస్తే పుణ్యం వస్తుందని స్వరూపానంద వివరించారు.