: వ్యాపం... చిన్న స్కామేగా!: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్య


15 ఏళ్లకు పైగా ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగిన కుంభకోణం. వందల కోట్ల మేర చేతులు మారిన కేసు. 50 మంది దాకా సాక్షులు, విచారణాధికారుల అనుమానాస్పద మరణాలు... ఇదీ మధ్యప్రదేశ్ లో వెలుగుచూసి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యాపం కుంభకోణం సంక్షిప్త రూపం. తవ్వేకొద్దీ విస్తుగొలిపే వాస్తవాలెన్నో ఈ కేసు దర్యాప్తులో వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ కేసు అంతపెద్దదేమీ కాదంటున్నాడో బీజేపీ సీనియర్ నేత. ‘‘ఇది మాకు చిన్న స్కామే. మీకెందుకు పెద్దగా కనిపిస్తుందో అర్థం కావడం లేదు’’ అంటూ విలేకరులనే ఎదురు ప్రశ్నించారు బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాస్ విజయవార్జియా. ఈయన చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ ఇరకాటంలో పడిపోయింది. ఇక ‘‘ఈ కేసులో బాధితుల ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వచ్చి నురగలు కక్కుతూ చనిపోయిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ నా కంటే గొప్పవాడేం కాదు కదా?’’ అని కూడా వ్యాఖ్యానించిన వార్జియా ఆనక నాలిక్కరుచుకున్నారు.

  • Loading...

More Telugu News