: కంట్రోల్ రూమ్ లో చంద్రబాబు... పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి


రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఇప్పటి వరకు 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో, పుష్కరాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన చేరుకున్నారు. పరిస్థితిని ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఘాట్ కు ఎక్కువ మంది భక్తులు తరలిరావడంతోనే తొక్కిసలాట చోటుచేసుకుందని అన్నారు.

  • Loading...

More Telugu News