: ట్యాపింగ్ పరికరాలను ఏపీ అడగలేదు... మీడియా కథనాలను ఖండించిన ‘ఆర్టస్’ సీఈఓ


ఓటుకు నోటు కేసు దరిమిలా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ పరికరాలను సమకూర్చుకునేందుకు యత్నించిందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. ఈ మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు సంప్రదించాయని భావిస్తున్న ‘ఆర్టస్’ కంపెనీ సీఈఓ ప్రభాకర్ కాసు ఈ వార్తలను ఖండిస్తూ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ట్యాపింగ్ పరికరాల కొనుగోలుపై తమతో ఏపీ ప్రభుత్వం సంప్రదించిందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కాని, ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు కాని తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News