: మాండరిన్ భాషలో 'బాహుబలి'... చైనాలో విడుదలకు సన్నాహాలు!


కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్బులో చేరిన చిత్రంగా 'బాహుబలి' ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ బహుభాషా చిత్రం భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయస్థాయిలో చాటింది. ఇప్పుడీ సినిమాను చైనాలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. చైనీయుల కోసం మాండరిన్ భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తారట. బాలీవుడ్ చిత్రం 'పీకే' చైనాలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు 'బాహుబలి' ఆ రికార్డులను తిరగరాస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.

  • Loading...

More Telugu News