: పుష్కరాల్లో పాల్గొనేందుకు ధర్మపురికి చేరుకున్న కేసీఆర్


గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ జిల్లా ధర్మపురికి చేరుకున్నారు. అక్కడ సీఎంకు స్థానిక నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హెలీప్యాడ్ నుంచి అక్కడ హరిత హోటల్ కు కేసీఆర్ వెళ్లారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బసచేస్తారు. రేపు ఉదయం 5.45 నిమిషాలకు సీఎం గోదావరిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తరువాత 6.26 నిమిషాలకు పుష్కర స్నానం చేస్తారు. అనంతరం ఇక్కడి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News