: ఐపీఎల్ లో మరో 'అవినీతి' వికెట్ పడింది!


ఐపీఎల్ లో అవినీతికి పాల్పడ్డాడంటూ ముంబయి క్రికెటర్ హికెన్ షాపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. ఐపీఎల్-8లో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ప్రవీణ్ తాంబేను ప్రలోభపెట్టేందుకు షా ప్రయత్నించాడని నిర్ధారణ కావడంతో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. షా తనను కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ 'ఆఫర్' చేసిన విషయాన్ని తాంబే నిజాయతీగా తన ఫ్రాంచైజీకి తెలియజేశాడు. దీంతో, ఈ అంశంపై బీసీసీఐ సీరియస్ గా దృష్టి పెట్టింది. 30 ఏళ్ల హికెన్ షా ప్రస్తుతం ఏ ఫ్రాంచైజీ తరపున ఆడడంలేదు. ముంబయి తరపున 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఈ క్రికెటర్ 2160 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ కరప్షన్ కోడ్ ను షా ఉల్లంఘించినట్టు తేలిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తక్షణమే అతడిపై సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News