: మరో వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(దాడిశెట్టి రాజా)పై తుని రూరల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఓ వివాదం సందర్భంగా ఎమ్మెల్యే రాజా తనను కులం పేరుతో దూషించారని నూకరాజు అనే వ్యక్తి తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు ఎమ్మెల్యే రాజాపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే.