: 14 నుంచి 25 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు
ఈ నెల 14వ తేదీ (రేపు) నుంచి 25వ తేదీ వరకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రెండు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు మూతపడనున్నాయి.