: మా పోరు చంద్రబాబుపైనే...ఏపీ ప్రజలపై కాదు: మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఫైరయ్యారు. పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చ కోసం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి అసెంబ్లీకి వచ్చిన శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తమ పోరాటం టీడీపీ అధినేత చంద్రబాబుపైనేనని చెప్పిన ఆయన, ఏపీ ప్రజలపై కాదని స్పష్టం చేశారు. ఏపీ సర్కారు చేపడుతున్న పట్టిసీమకు ఎలాంటి అనుమతులు లేకున్నా తామేమీ అడ్డు చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకుంటే చంద్రబాబును పాలమూరు ప్రజలు హైదరాబాదులో అడుగుపెట్టనివ్వరని ఆయన హెచ్చరించారు.