: ‘పాలమూరు’ ఫైట్ జరిగేనా?... ‘రావుల’ కోసం అసెంబ్లీలో జూపల్లి పడిగాపులు!
పాలమూరుగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై అధికార టీఆర్ఎస్, విపక్ష టీడీపీలు కత్తులు దూసుకున్నాయి. ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. జూపల్లి పేర్కొన్న సమయం రానే వచ్చింది. సహచర మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి అసెంబ్లీకి వచ్చిన జూపల్లి... రావుల కోసం వేచి చూస్తున్నారు. తాను వేచిచూస్తున్న విషయాన్ని మీడియా ద్వారా రావులకు తెలిపారు. అయితే ప్రస్తుతం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీలో రావుల ఉన్నారట. మరి జూపల్లితో బహిరంగ చర్చ కోసం రావుల అసెంబ్లీకి వస్తారో, డుమ్మా కొడతారో చూడాలి.