: లాస్ట్ బస్ మిస్సయ్యాను... లిఫ్టివ్వండి! సచిన్ ట్వీట్లకు భారీ స్పందన


‘‘చిట్ట చివరి బస్సు కూడా మిస్సయ్యాను.. ఎవరైనా లిఫ్టివ్వండి ప్లీజ్’’ అని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కోరితే, ఎన్ని కార్లు క్యూ కడతాయో కదా? ప్రస్తుతం సచిన్ నుంచి వచ్చిన అలాంటి అభ్యర్థనే ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది. వింబుల్డన్ టోర్నీని ఆస్వాదించేందుకు భార్య అంజలితో కలిసి ఇంగ్లండ్ వెళ్లిన సచిన్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న అతడి ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. ‘‘నేనిప్పుడు గ్రేట్ హాస్లేలో ఉన్నా. చివరి బస్సు మిస్ అయ్యాను. ఎవరైనా లిఫ్ట్ ఇవ్వగలరా?’’ అంటూ ఆ పోస్ట్ లో సచిన్ చిలిపి వ్యాఖ్యలు చేశాడు. అంతేకాక రోడ్డు పక్కగా చెట్టుకు ఆనుకుని, బెంచీపై కూర్చుని అటుగా ఏవైనా వాహనాలు వస్తాయా? అంటూ ఎదురుచూస్తున్నట్లుగా ఉన్న తన ఫొటోలను ఆ ట్వీట్ కు జతచేశాడు. చిలిపిగానే కాక ఆసక్తికరంగా ఉన్న ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వెల్లువెత్తుతోంది.

  • Loading...

More Telugu News