: అదనపు లడ్డూ టోకెన్ల జారీ విధానాన్ని ప్రారంభించిన టీటీడీ
అదనపు లడ్డూ టోకెన్ల విషయంలో తిరుమల భక్తులకు నేటితో కష్టాలు తీరుతున్నాయి. ఇకనుంచి లడ్డూల కోసం గంటల తరబడి భక్తులు నిరీక్షించాల్సిన అవసరంలేదు. కంపార్టుమెంట్లలోనే అదనపు లడ్డూ టోకెన్లు జారీచేసే విధానాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు ఈరోజు ప్రారంభించారు. అదనపు లడ్డూలు కోరుకునే భక్తులకు నేటి నుంచి కంపార్టుమెంట్లలోనే టోకెన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.