: సామాన్యుడి చెంతకు హెలికాప్టర్... షికారుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో, హెలికాప్టర్ టూరిజానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో, హెలికాప్టర్ ప్రయాణం ధనవంతులకే కాక, సామాన్యుడి చెంతకు కూడా వచ్చినట్టైంది. ప్రభుత్వ నిర్ణయంతో, సామాన్యుడు సైతం హెలికాప్టర్ ఎక్కి, పుష్కర శోభను వీక్షిస్తూ, గోదావరిపై షికార్లు చేయవచ్చు. దీని ద్వారా హెలికాప్టర్ ఎక్కిన అనుభూతిని పొందడమే కాకుండా, గోదావరి అందాలను ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించవచ్చు. హెలికాప్టర్ షికారుకు 10 నిమిషాలకు రూ. 2వేలు ఛార్జ్ చేస్తారు. పుష్కరాలు ఉండే 12 రోజుల పాటు ఈ ట్రిప్పులు కొనసాగుతాయి. ఈ పథకం పూర్తి స్థాయిలో విజయవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

  • Loading...

More Telugu News