: కేసు విచారణకు రేవంత్ హాజరుకావల్సిందే: ఏసీబీ కోర్టు ఆదేశాలు
ఓటుకు నోటు కేసులో నేటి విచారణకు టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గైర్హాజరవడంపై హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 3న హాజరుకావాలని ఆదేశించింది. బెయిల్ ఇచ్చిన సమయంలో నియోజకవర్గానికే పరిమితం కావాలని, హైదరాబాద్ కు రావొద్దంటూ హైకోర్టు రేవంత్ కు షరతు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొడంగల్ లో ఉంటున్న ఆయన లాయర్ ద్వారా అదే విషయాన్ని కోర్టుకు మెమోలో తెలిపారు. బెయిల్ ఉన్నప్పటికీ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తదుపరి విచారణ వాయిదాపడింది. మరోవైపు ఇదే కేసులో ఏ2, ఏ3 నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహలు కోర్టుకు హాజరయ్యారు.