: హర్షకుమార్ కు 14 రోజుల రిమాండ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు


శ్మశానానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపి కలకలం రేపిన మాజీ ఎంపీ హర్షకుమార్ కు రాజమండ్రి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నిన్న జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో హర్షకుమార్ పోెలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. తన దీక్షను భగ్నం చేసేందుకు యత్నించిన పోలీసులను హర్షకుమార్ అడ్డుకున్నారు. తనను బలవంతంగా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఆయన తన రివాల్వర్ తో నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ఆస్పత్రి నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఆ తర్వాత రాజమండ్రి మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన లొంగిపోయారు. గాల్లోకి కాల్పులు జరిపిన హర్ష కుమార్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. హర్షకుమార్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News