: జీహెచ్ఎంసీలో మరో అవినీతి చేప...రూ.5 కోట్లు కూడబెట్టిన సెక్షన్ ఆఫీసర్ ఇమ్మానుయేల్
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మరో అవినీతి చేప పట్టుబడింది. జీహెచ్ఎంసీలో కూకట్ పల్లి సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఇమ్మానుయేల్ ఇంటిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నేటి ఉదయం దాడి చేశారు. కూకట్ పల్లిలోని ఇమ్మానుయేల్ ఇల్లు, వరంగల్ లోని అతడి బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడి చేసిన ఏసీబీ అధికారులు ప్రస్తుతం ముమ్మర సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇమ్మానుయేల్ రూ.5 కోట్ల మేర అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించింది.