: ‘బాహుబలి’కి చంద్రబాబు ప్రశంస!
భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మేరకు నేటి తెల్లవారుజామున ట్విట్టర్ లో ఆయన ‘బాహుబలి’ చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మాస్టర్ పీస్ లాంటి బాహుబలి చిత్రాన్ని తీసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, అతడి యూనిట్ ను అభినందిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు’’ అని చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు.