: నీళ్ల కోసం 'మహా' గవర్నర్ కు కేసీఆర్ ఫోన్


గోదావరి పుష్కరాల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే, పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన కొన్ని ఘాట్ల వద్ద నీళ్లు లేకపోవడం ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా పరిణమించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కు ఫోన్ చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో, దిగువకు నదీ జలాలు విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడగా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పుష్కరాలు ముగిసేంతవరకు నీటిని విడుదల చేయాలని కేసీఆర్ ఆదివారం గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News