: సానియా విజయంపై సీఎం చంద్రబాబు ట్వీట్


ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో మార్టినా హింగిస్ జతగా సానియా మీర్జా మహిళల డబుల్స్ టైటిల్ గెలవడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. సానియా విజయంపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. వింబుల్డన్ టైటిల్ నెగ్గడం ద్వారా సానియా యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు. టైటిల్ నెగ్గినందుకు ఆమెను అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా సానియాను ప్రశంసించారు. డబుల్స్ విభాగంలో తొలి గ్రాండ్ స్లామ్ ను సాధించినందుకు అభినందనలు తెలియజేశారు. అటు, తన కెరీర్లో అతిపెద్ద విజయంపై సానియా స్పందిస్తూ... ఈ విజయం అనేకమంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News