: రాణించిన ఓపెనర్లు... 34 ఓవర్లలో 160/2
హరారేలో జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు మురళీ విజయ్, అజింక్యా రహానే తొలి వికెట్ కు 112 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. కెప్టెన్ రహానే 63 పరుగులు చేసి చిభాభా బౌలింగ్ లో అవుటయ్యాడు. అనంతరం బరిలో దిగిన అంబటి రాయుడుతో కలిసి విజయ్ ఇన్నింగ్స్ నడిపించడంతో భారత్ స్కోరు 150 పరుగుల మైలురాయి దాటింది. అయితే, 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విజయ్ వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 34 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో రాయుడు (21 బ్యాటింగ్), మనోజ్ తివారీ (0 బ్యాటింగ్) ఉన్నారు.