: ఆ పుకార్లను పట్టించుకోవద్దు... అన్ని మతాలపై నాకు గౌరవం ఉంది: సల్మాన్
తన పేరు ఉపయోగించుకుని మత వ్యతిరేక సందేశం వ్యాప్తి చేస్తున్న వ్యక్తుల పట్ల బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. "వాట్స్ యాప్ లో నా పేరుతో తప్పుడు సందేశం హల్ చల్ చేస్తోంది. ఫ్యాన్స్ అలాంటి పుకార్లను పట్టించుకోరాదు. దీనిపై పోలీసులు చర్య తీసుకుంటున్నారు. నాకు అన్ని మతాలపైనా గౌరవం ఉంది. అంతెందుకు, మా ఇంట్లో అన్ని మతాలకు చెందిన వాళ్లం ఉన్నాం కదా!" అని పేర్కొన్నారు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ముస్లిం కాగా, తల్లి సుశీల హిందువు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ అర్ధాంగి మలైకా క్యాథలిక్ వర్గానికి చెందిన మహిళ. ఇక, సల్మాన్ సోదరి అల్వీరా ఖాన్ భర్త అతుల్ అగ్నిహోత్రి హిందువే!