: అంతా రహస్యమే... ఏం తవ్వితీస్తున్నారో వెల్లడించని 75 శాతం గనుల సంస్థలు


ఇండియాలో గనుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనడానికి మరో సాక్ష్యం ఇది. గనులను తవ్వి ఖనిజాలు వెలికితీసే కాంట్రాక్టులను పొందిన కంపెనీల్లో 75 శాతం తాము ఎంత ఖనిజాన్ని బయటకు తీసుకొచ్చామన్న విషయాన్ని వెల్లడించలేదు. గడచిన ఏడేళ్లలో నాలుగింట ఒక వంతు సంస్థలు మాత్రమే ఖనిజాల వివరాలు వెల్లడించాయని కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు మొత్తం 920 తవ్వకం అనుమతులను నవంబర్ 2007 నుంచి డిసెంబర్ 2014 మధ్య జారీ చేయగా, కేవలం 186 కంపెనీలు మాత్రమే తమకు డేటాను అందించారని వివరించింది. ఈ ఏడేళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ 161, మధ్యప్రదేశ్ 523, రాజస్థాన్ 259 లైసెన్సులను జారీ చేయగా, రాజస్థాన్ లో 13 శాతం, మధ్యప్రదేశ్ లో 20 శాతం మాత్రమే వెలికితీత సమాచారాన్ని అందించాయని తెలిపింది. మిగతా సంస్థల కార్యకలాపాల గురించి విచారిస్తున్నామని తెలిపింది. కాగా, గనుల శాఖ సమాచారం ప్రకారం 5.7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న భారతావనిలో 32.8 లక్షల చదరపు కి.మీ. పరిధిలో గనులున్నాయి. వీటిల్లో కేవలం 5,046 చదరపు కి.మీ. పరిధిలోనే తవ్వకాలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News